Monday, October 5, 2020

తెలుగు లొ టైప్ చేయడం యెలా

తెలుగు లొ టైప్ చేయడం యెలా
How to type in Telugu

మీరు బ్లాగ్ లో చాల సులువుగా తెలుగు అక్షరాలతో ద్వారా చేయవచ్చు.

అయితే మీరు కోరుకున్న అందమయిన మరియు ఆకర్శనీయమయిన అక్షరాలతో ఉచితంగా అందుబాటులో ఉన్న వెబ్ హోస్టింగ్ లలో సాధ్యం కాదు. మాములు తెలుగు అక్షరాలతో మాత్రమె ఉచితంగా అందుబాటులో ఉన్న వెబ్ హోస్టింగ్ లలో బ్లాగింగ్ చేయవచ్చు.

కాని పెయిడ్ వెబ్ హోస్టింగ్ సైట్లలో “Word Press” సహాయంతో అందమయిన మరియు ఆకర్శనీయమయిన అక్షరాలతో చాల అద్భుతంగా తెలుగులో రాయ వచ్చు. 

తెలుగులో అందమయిన మరియు ఆకర్శనీయమయిన అక్షరాలతో మీరు వెబ్ సైట్ కాని బ్లాగ్ క్రియేట్ చేస్తే సదరు వెబ్ సైట్ కి వీక్షకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

అంతే కాదు, ఒక సారి మీ బ్లాగ్ కి వచ్చిన User మీ వెబ్ సైట్ ని చివరి వరకు చదవడానికి మక్కువ చూపుతాడు.

మీకు ఉచిత వెబ్ హోస్ట్ సైట్ లలో మామూలు తెలుగు అక్షరాలలో ఎలా రాయ వచ్చునో చాలా వివరంగా https://blogintelugu.com అనే వెబ్ సైట్ లో  తెలియజేసారు.

ఒక బ్లాగ్ లో తెలుగు అక్షరాలలో వ్రాయడనికై  గూగుల్ క్రోం ( Google Chrome ) బ్రౌజర్ లో Google Input Tool Extension ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. 

మీరు ఎ బ్లాగర్ లో తెలుగు లో రాయాలనుకుంటున్నారో ఆ బ్లాగర్ యొక్క పోస్ట్ పేజి ని ఓపెన్ చేయండి. తెలుగు లో రాయాలనుకున్నప్పుడు సింపుల్ గా పైన కనబడే “Google input Tool icon” ని క్లిక్ చేసి “తెలుగు ఫోనెటిక్ ఆప్షన్” ని ఎంచుకోని “తెలుగు” లో రాయడం మొదలు పెట్టండి.

Using Google Documents : మొదలు మీరు గూగుల్ డాక్యుమెంట్స్ లో మీ కంటెంట్ రాయండి.

Google Documents ని మీ gmail user name ద్వారా ఓపెన్ చేసుకొని English to Telugu typing online ద్వారా మీకు కావలసిన కంటెంట్ టైప్ చేయండి.

Using Pramukh Web Site: ఈ వెబ్ సైట్ ద్వారా మీరు డైరెక్ట్ గా అంటే ఎటువంటీ లాగిన్ అవసరం లేకుండా Online లో తెలుగు టైపింగ్ ( Typing in Telugu ) చేయవచ్చు.  Pramukh Web Site వెబ్ సైట్ లో మెనూ బార్ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

పైన పేర్కొనబడిన విధానాలలో మీరు దేని ద్వారనైన కంటేంట్ ని మొత్తం రాసిన తరువాత దానిని కాపి చేసి మీ బ్లాగు లో పేస్ట్ చేసుకోవచ్చు.

ఒక వేళ బ్లాగ్ లో కాకుండా ఎదేని ఇతర అవసరాల నిమిత్తం మీరు MS Word లో గాని, MS Excel లో గాని తెలుగులో టైప్ చేయలనుకుంటే మీరు Google Documents లో కాని Pramukh Web Site లో కాని రాసిన తరువాత దాన్ని కాపి చేసి MS Word ఫైల్ లో లేదా MS Excel ఫైల్ లో పేస్ట్ చేసి సేవ్ చేసుకున వచ్చు.

No comments:

Post a Comment